బ్రేకింగ్ : రాత్రి ఫ్లైట్ లో తిరిగి చంద్రబాబు….?
టీడీపీ అధినేత చంద్రబాబును తిరిగి అమరావతికి పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 7.45 గంటలకు విమానం ఉండటంతో చంద్రబాబును అందులో అమరావతిని పంపేందుకు పోలీసులు అంతా [more]
టీడీపీ అధినేత చంద్రబాబును తిరిగి అమరావతికి పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 7.45 గంటలకు విమానం ఉండటంతో చంద్రబాబును అందులో అమరావతిని పంపేందుకు పోలీసులు అంతా [more]
టీడీపీ అధినేత చంద్రబాబును తిరిగి అమరావతికి పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 7.45 గంటలకు విమానం ఉండటంతో చంద్రబాబును అందులో అమరావతిని పంపేందుకు పోలీసులు అంతా సిద్ధం చేశారు. చంద్రబాబును ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించడంతో ఆయనను విశాఖ నగరంలోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతించడం లేదు. నిజానికి చంద్రబాబు ప్రజాసంకల్ప యాత్రతో పాటు పలు ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈరోజు ఒక వివాహ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాలి. అలాగే రేపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు వివాహానికి హాజరు కావాల్సి ఉంది. ఈ విషయాలను పోలీసులకు చంద్రబాబు చెప్పినా అంగీకరించడం లేదని తెలిసింది.