
పోలవరం పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యవహారశైలే అనుమానాలకు కారణమని చెప్పారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. అనవసరంగా పోలవరం ప్రాజెక్టును వివాదంలోకి ప్రభుత్వమే లాగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తాను తీసిన గోతిలో తానే పడుతుందన్నారు. తన పాలనలోనే పోలవరం ప్రాజెక్టుకు ముందడుగు పడిందన్నారు. ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి తెచ్చుకోకుంటే ఇప్పటికీ పోలవరం ముడిపడేది కాదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పోలవరం పనులు మొదలయ్యాయని చంద్రబాబు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా పోలవరం పనులు ప్రారంభం కాలేదన్నారు.
Leave a Reply