సివిల్స్ ర్యాంకర్ …ఓ మసాజ్ పార్లర్

సివిల్స్ సాధించడం ఓ యువకుడి లక్ష్యం. ఇందుకోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కి వచ్చి శిక్షణ తీసుకుని, కష్టపడి చదివి అనుకున్న లక్ష్యానికి చేరువయ్యారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు దాటి ర్యాంక్ సాధించాడు. ఈ పాటికే అతడు ఏదైనా శాఖలో ఉన్నతాధికారి హోదాలో ఉండాల్సిన వ్యక్తి. కానీ, అతడు వేసిన తప్పటడుగులే భవిష్యత్ ను నాశనం చేశాయి. దీంతో పోలీసు కేసుల్లో ఇరుక్కుని ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

మసాజ్ సెంటర్ నడిపి…

విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ సివిల్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటూనే నారాయణగూడలో ఓ సెలూన్ ను పార్ట్ నర్ షిప్ లో ప్రారంభించాడు. అయితే, భాగస్వాముల మధ్య గొడవ జరగడంతో సంతోష్ పై నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఓ భాగస్వామి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అచినా, 2016లో సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించాడు. కానీ, ఉద్యోగంలో చేరేందుకు కేసు అడ్డంకిగా మారడంతో సంతోష్ నియామకాన్ని నిలిపివేశారు అధికారులు. అయితే, ఈ దశలో పాత కేసును, వివాదాన్ని ముగించుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారు. కానీ సంతోష్ మాత్రం కొత్త కేసులు తగిలించుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ నిలిచిపోవడంతో అతడు సెలూన్ నే మసాజ్ సెంటర్ గా మార్చాడు. అందులో నిబంధనలకు విరుద్ధంగా మగవారికి ఆడవారితో మసాజ్ చేయిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు దాడి చేయగా నిజమే అని తేలింది. దీంతో అదే నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో సంతోష్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. విచారణలో భాగంగా తాను సివిల్స్ ర్యాంకర్ నని సంతోష్ చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*