చంద్రబాబు వ్యూహమేంటో చెప్పిన మాజీ కాంగ్రెస్ నేత
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 వేల ఓట్లు చీల్చి వైసీపీ విజయావకాశాలు దెబ్బతీయడమే చంద్రబాబు వ్యూహమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి [more]
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 వేల ఓట్లు చీల్చి వైసీపీ విజయావకాశాలు దెబ్బతీయడమే చంద్రబాబు వ్యూహమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి [more]
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 వేల ఓట్లు చీల్చి వైసీపీ విజయావకాశాలు దెబ్బతీయడమే చంద్రబాబు వ్యూహమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ… జగన్ ను ఓడించేందుకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి వైసీపీ ఓట్లు చీల్చాలని ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ ఆర్థికంగా సహకరిస్తుందన్నారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కయ్యిందన్నారు. కాంగ్రెస్ తీరు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.