
ఉద్యోగులను వాడుకుంది ఎవరని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. గతంలో పోలవరం సందర్శనకు, ఢిల్లీలో నవ నిర్మాణ దీక్షలకు ఉద్యోగులను ప్రజల సొమ్ముతో ఎవరు తీసుకెళ్లారని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగులను పార్టీ పరంగా వాడుకున్నారన్నారు. రాజకీయాల్లోకి తమను లాగవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య పోరులో ఉద్యోగుల నలిగిపోతున్నారన్నారు. ఎన్నికల నిర్వహణపై ఈసీకి నమ్మకం లేదన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ఎస్ఈసీ ఉద్యోగులను టార్గెట్ చేస్తుందన్నారు. ఎన్నిలకు సహకరిస్తామన్న వాళ్లతోనే నిర్వహించుకోవాలని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎస్ఈసీ ప్రభుత్వ ఉద్యోగులను బలి చేయాలని చూస్తున్నారన్నారు. తమను రాజకీయాల్లోకి లాగవద్దని ఆయన సూచించారు.
Leave a Reply