
సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుండటంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. రేపు హైకోర్టులో మూడు రాజధానుల అంశం విచారణకు రానుంది. విచారణను రోజు వారీ అంశంగా చేర్చి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
చంద్రదశ ప్రభావం వలన ఏ కోర్టులో 3 రాజధానులు అనుకూలంగా రాదేమో. అయినా విశాఖపట్నం లో మెట్రో, ఎయిర్పోర్ట్, సీఎం అక్కడికి వెళ్లినప్పుడు ఉండడానికి మంచి గెస్ట్ హౌస్,విశాఖ భీమిలి రోడ్లు అన్నీ అభివృద్ధి చెందుతాయి.అమరావతి లో రైతులకు ప్లాట్లు వస్తాయి. ఇప్పుడు ఉన్న అమరావతి ఎప్పుడూ అలాగే ఉండొచ్చు.ప్లాట్లు ఇవ్వగా మిగిలిన ల్యాండ్ లో వ్యవసాయం చేసుకోవడమే.