
పార్టీ మేనిఫెస్టో కమిటీతో వైసీపీ అధినేత జగన్ ఇవాళ సమావేశమయ్యారు. కమిటీకి వచ్చిన సూచనలను, సలహాలను మేనిఫెస్టో కమిటీ జగన్ దృష్టికి తెచ్చింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… అమలు చేయగలిగిన వాగ్దానాలనే మేనిఫెస్టోలో చేర్చాలని, వాగ్దానాలు ఇవ్వడంలో ఏ పార్టీతోనూ పోటీ వద్దని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు సంబంధించి ఆర్థిక భారాన్ని, అమలు సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలను పరిష్కరించేలా మేనిఫెస్టో ఉండాలన్నారు. మేనిఫెస్టో తక్కువ పేజీల్లో ఉండాలని, అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా ఉండాలని జగన్ సూచించారు.
Leave a Reply