
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. దేశ ప్రజల సంక్షేమం, రెండు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యం కోసం పవన్ కల్యాణ్ చతుర్మాస దీక్షను ప్రారంభించారు. నాలుగుమాసాల పాటు చతుర్మాస దీక్ష కొనసాగనుంది. దీక్షా సమయంలో పవన్ కల్యాణ్ ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. తొలి ఏకాదశి నాటి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి నాడు పవన్ కల్యాణ్ దీక్షను విరమిస్తారు. దీక్ష విరమణ సమయంలో హోమాన్ని కూడా పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. నాలుగు నెలల పాటు అన్నింటికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటారు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.
Leave a Reply