Wed May 01 2024 21:50:03 GMT+0000 (Coordinated Universal Time)
ముహూర్తం ఫిక్స్....!
తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారయింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకశాఖలకు సంబంధించిన అంశాలకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ రద్దుపై మంత్రి వర్గం తీర్మానం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఒంటిగంటకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభమై అరగంటలో ముగుస్తుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. తర్వాత రెండు గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. రెండుగంటలకు కేసీఆర్ అధికారికంగా రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
Next Story