
కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయం దక్కించుకున్నారు. కల్పలతకు 6,153 ఓట్లు రావడంతో ఆమెను ఎమ్మెల్సీ గా ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం పనిచేస్తానని కల్పలత చెప్పారు. తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ కల్పలత కృతజ్ఞతలు తెలిపారు.
Leave a Reply