
కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ప్రకటించింది. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్ అని ఆ పార్టీ రాష్ట్ర శాఖ తెలిపింది. ఇటీవలే శ్రీధరన్ బీజేపీలో చేరారు. శ్రీధరన్ అయితేనే పార్టీకి కేరళలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఆయనకున్న క్లీన్ ఇమేజ్ తమకు, తమ పార్టీకి ఉపకరిస్తుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Leave a Reply