
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నియోజకవర్గంలోనైనా పర్యటిస్తానని, అడగటానికి మీరెవ్వరని కేశినేని నాని ప్రశ్నించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఓడిపోయినా, తాను ఎంపీగా గెలిచిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రూముల్లో కూర్చునే వారు నాయకులు కాదన్నారు. ప్రజల్లో ఉంటేనే నాయకుడిగా ఎదగగలరని కేశినేని నాని అన్నారు. ఎవరికో భయపడి తాను చేతులు ముడుచుకుని కూర్చోనని, మీఇష్టం వచ్చిన వారికి ఫిర్యాదు చేసుకోవచ్చని కేశినేని నాని సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
Leave a Reply