మెగా హీరోలు అంత బిజీనా..?

పవన్ కల్యాణ్

ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అక్కడ టీడీపీ, వైసీపీ హోరాహోరి తలపడుతున్నాయి. ఇక నేను కూడా ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ వస్తున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ మాటల యుద్ధంతో మీడియా మొత్తం మార్మోగిపోతోంది. ఇక ఈసారి టీడీపీకి సినిమా గ్లామర్ దూరమైంది. కానీ వైసీపీకి మాత్రం పలువురు యాక్టర్స్ మద్దతిస్తున్నారు. ఇక జనసేన సినిమా గ్లామర్ పార్టీనే. పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ హీరోగా ఉన్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మరి అన్నగారు ప్రజారాజ్యం పార్టీతో సాధించలేనిది.. జనసేన తో సాధిస్తాను.. ఒక్కసారి సీఎం పదవి ఇవ్వండి అంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు. మరి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు.. ఆ ఎన్నికల కోసం మెగా ఫ్యామిలీలోని హీరోలు ప్రచారానికి రోడ్డెక్కారు.

నాగబాబు ఒక్కరు మాత్రమే…

కానీ ఈ ఎన్నికల్లో మెగా హీరోలు ఎవరూ పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడేటట్లు కనిపించడం లేదు. ఇంకా ఎన్నికల ప్రచారానికి కేవలం 16 రోజుల టైం మాత్రమే ఉంది. ఏదో బాలకృష్ణని ట్రోల్ చేస్తూ వీడియోస్ రూపంలో గలాటా చేసిన నాగబాబు నిన్నగాక మొన్న జనసేనలోకి చేరి నర్సాపురం ఎంపీ టికెట్ సంపాదించాడు. గతంలో ఫ్యాన్స్ మెగా ఫ్యామిలిని పవన్ ఏడంటూ అడిగినప్పుడు వాడి గురించి నాకు తెలియదని విసుకున్న నాగబాబుకు ఈ రోజు తమ్ముడు పవన్ గుర్తొచ్చాడు. కారణం ఎంపీ టికెట్. సరే అదలా ఉంటే రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నాని అన్నాడు కానీ ప్రస్తుతం చడీ చప్పుడు చేయడం లేదు. #RRR షూటింగ్ తో పొరుగు రాష్ట్రం వెళ్లిపోయాడు. ఇక చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీ. అటు కాంగ్రెస్ వాళ్లకి కూడా చిరు దొరకడం లేదు. గత ఎన్నికల్లోనే చిరు గాయబ్. అసలు తమ్ముడు జనసేనపై చిరు స్పందన కరువు.

వారంతా ప్రచారానికి రారా..?

మరోపక్క వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి మెగా హీరోలు కూడా జనసేనపై స్పందించడానికి జంకుతున్నారు. మరి మెగా హీరోల గ్లామర్ జనసేనకు అందనట్టే కనబడుతుంది. నాగబాబు ఒక్కడే పవన్ కళ్యాణ్ భజన చెయ్యాల్సిన పరిస్థితి. మరి రెండు చోట్ల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ తో తన సీట్స్ లో గెలిచేస్తాడేమో కానీ మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక మెగా ఫ్యామిలీ రాకపోతేనే బెటర్ అన్నట్టుగా పవన్ కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మెగా హీరోలు అందరు దిగినా పని జరగలేదు. అందుకే ఈసారి కావాలనే దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

1 Comment on మెగా హీరోలు అంత బిజీనా..?

Leave a Reply

Your email address will not be published.


*