
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం ముగిసింది. దాదాపు ఇరవై నిమిషాల పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. రేపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ నోటిఫికేషన్ విడుదలకానుండటం, ఉద్యోగులు విధుల్లోకి రాలేమని చెప్పడం, ప్రభుత్వ సహకారం వంటి విషయాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల బదిలీ చేయాలని తాను ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ఉన్నతాధికారులతో భేటీ అయి ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు.
Leave a Reply