
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను గవర్నర్ కు వివరించనున్నారు. నిన్న ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ ను కలసి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. కరోనాను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు, బ్యాలట్ పేపర్ తో ఎన్నికను నిర్వహించాల్సి రావడం వంటి విషయాలను గవర్నర్ దృష్టికి తేనున్నారు.
Leave a Reply