మరోసారి నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ కు ప్రయత్నించారు. మరోసారి ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ కు ప్రయత్నించారు. మరోసారి ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ కు ప్రయత్నించారు. మరోసారి ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించేందుకు నిన్న నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం అంగీకరించలేదు. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని సీఎస్ నిమ్మగడ్డకు లేఖ రాశారు. అయితే తాజాగా మరోసారి వీడియో కాన్ఫరెన్స్ కు సహకరించాలంటూ మరోసారి లేఖ రాశారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీఓలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకుంటున్నారు. మరి రెండో లేఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.