
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మరో లేఖ రాశారు. ఎన్నికలను ఫిబ్రవరి నెలలో జరపాలని నిర్ణయించామని, దీనికి సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో కోరారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే ఎన్నికలను నిర్వహించాలనుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అయ్యే నిధులను కూడా కేటాయించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీలంసాహ్నిని కోరారు. ఎన్నికల ఏర్పాట్లకు సహకరించేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని నిమ్మగడ్డ కోరారు.
Leave a Reply