
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి వాణీమోహన్ ను విధుల నుంచి తప్పించారు. వాణి మోహన్ సేవలు ఎన్నికల కమిషన్ కు అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వాణి మోహన్ ను రిలీవ్ చేశారు. తనకు నమ్మకం లేని అధికారులను తొలగించే పనిలో పడ్డారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
Leave a Reply