బాబుకు గడ్కరీ ఛాలెంజ్…!!

నితిన్ గడ్కరీ

చంద్రబాబు కేంద్రం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.. బాబు బీజేపీతో ఉన్నా లేకున్నా కేంద్రం నిధులు ఇస్తోందని, వేల కోట్ల రూపాయలు తీసుకుంటూనే ఏమి ఇవ్వడం లేదని అంటున్నారన్నారు. పంచాయితీ రాజ్ శాఖకు 24వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని, లోకేష్ ఆ శాఖకు వచ్చిన తర్వాత ఇచ్చిన నిధులు జేబులు నింపుకున్నారని విమర్శించారు. చంద్రబాబుని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ గా పెట్టాలని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల కంటే ఆయనే ఎక్కువగా తమ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారన్నారు. బాబుకి మానసిక స్థితి సరిగా లేదన్నారు. లక్షల కోట్లు దోచినా ఆయనకు దాహం తీరడం లేదన్నారు.

మతి స్థిమితం లేని వ్యక్తి…..

మతి స్థిమితం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండటం దురదృష్టకరమని కన్నా నిప్పులు చెరిగారు .ఏపీ అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రమని, ఈ రాష్ట్రం శ్రమిస్తోన్న తీరు దేశానికి ఆదర్శమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ ది జాతీయ వాదం, అంతర్గత భద్రత తో పాటు దేశ భద్రత తమ ప్రధాన లక్ష్యమని గడ్కరీ పేర్కొన్నారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, సబ్ కా సత్ సబ్ కా వికాస్ మా నినాదమన్నారు. జాతీయ వాదం., సుపరిపాలన., అట్టడుగు వర్గాల అభివృద్ధి మా లక్ష్యమని వివరించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి మా కర్తవ్యమని, దీన్ దయాల్ మార్గంలో వెళుతున్నా36కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చామని చెప్పారు. 10కోట్ల మందికి ఇవ్వాలన్న లక్ష్యమన్నారు. 100 శాతం విద్యుత్ సరఫరా పేదలకు ఇవ్వాలి అని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు.

సర్వే చేయించండి….

2022నాటికి పేదలు అందరికి ఇళ్ళు., 10లక్షల మందికి ఆయుష్ యోజన ద్వారా ఆరోగ్యం అందిస్తామన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోందని, తమతో కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఎవరితో అయినా సామాజిక ఆర్థిక సర్వే చేయించి మాట్లాడాలని, అన్ని రంగాల్లో 50ఏళ్లలో జరిగిన అభివృద్ధి తో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి పోల్చి చూడాలని గడ్కరీ సవాల్ విసిరారు. తాను ఉపరితల రవాణా మంత్రినని….తాను ఛాలెంజ్ చేస్తున్నానని, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ రాష్ట్రానికి ఏమి చేసిందో చూడాలని కోరారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. డిఏపీ లో 4192 కిమీ జాతీయ రహదారులు ఇప్పుడు 7246 అయ్యాయని, 1,25,000కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, భారత మాల., సేతు భారతం లలో ఆంధ్ర ప్రదేశ్ లకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు గడ్కరీ. అనంతపురం -అమరావతి 20వేల కోట్ల తో 5 డిస్ట్రిక్ట్స్ లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హై వే ఇస్తున్నామని చెప్పారు. ఇందులో 9.41కి.మీ సొరంగ మార్గం ఉంటుందన్నారు. అమరావతి నగరానికి 18,700కోట్లతో 189కిమీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇస్తున్నామన్నారు. విజయవాడ ముఖ చిత్రం మార్చే ప్రాజెక్టులు కేంద్రం ఇస్తోందని గడ్కరీ వివరించారు. సాగర మాల ప్రాజెక్టు లో భాగంగా విశాఖ నగరానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 53ప్రాజెక్టులు 33,042 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టామని, పోర్టు ల నిర్మాణంతో భారీ ఎత్తున ఉపాధి లభిస్తోందని చెప్పారు. 1,62,749కోట్లతో పోర్టుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సాగర మాల ప్రాజెక్టులో 36 రోడ్ల అనుసందానం జరుగుతోందన్నారు. 10వేల కోట్ల రూపాయల రైల్వే సంబంధిత ప్రాజెక్ట్ లు జరుగుతున్నాయని, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. చిత్తూరు, నెల్లూరు లలో కొత్త సెజ్ ఏర్పాటు అవుతోందని తెలిపారు.

Ravi Batchali
About Ravi Batchali 34173 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*