
ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. రేణు దేశాయ్ ని మిస్ అంటూ సంబంధిస్తూ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘సంతోషకరమైన కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మిస్ రేణు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రశాంతంగా జీవించాలని, అంతా మంచి జరగాలని కోరుతుంటున్నాను’ అని పవన్ ట్వీట్ చేశారు. పవన్ ను విడిపోయాక రేణు ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఓ కుమారుడు, కూతురు. అయితే, ఇటీవల మరో వివాహం చేసుకోనున్నట్లు ఆమె ప్రకటించగా కొందరు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శించారు. ప్రస్థుతం పవన్ కళ్యాణ్ స్వయంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇటీవలే నిశ్చితార్ధం జరుపుకుంది. కాబోయే భర్త వివరాలను మాత్రం ఆమె ఇంకా బయటకు వెళ్లడించలేదు.
Leave a Reply