
తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడితే గుర్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా పోలీసులను హెచ్చరించారు. రైతులను పరామర్శించేందుకు వచ్చిన తమను ఎలా అడ్డుకుంటారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ జనసేన అంటే భయపడుతుందన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలుచేశారు. తాము ఆశయం కోసమే రోడ్లమీదకు వస్తున్నామన్నారు. రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
Leave a Reply