
రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి చెందారు. అమర్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అమర్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 2012లో ఆయన సింగపూర్ వెళ్లి వైద్య చికిత్స చేయించుకుని వచ్చారు. 1956జనవరి 27 అమర్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజమ్ ఘర్ లో జన్మించారు. సుదీర్ఘకాలం సమాజ్ వాదీ పార్టీలో పనిచేశారు. ములాయం సింగ్ కు సన్నిహితుడిగా మెలిగారు. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అమర్ సింగ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. బిగ్ బి అమితాబ్ కు అమర్ సింగ్ సన్నిహితుడు. అలాగే జయప్రదను సమాజ్ వాదీ పార్టీలోకి తీసుకెళ్లి యూపీ నుంచి ఎంపీని చేసింది కూడా అమర్ సింగ్.
Leave a Reply