Tue Apr 23 2024 21:44:12 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల అదుపులో రేవంత్
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈరోజు కొడంగల్ లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు బహిరంగ సభ ఉండటంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ లో కేసీఆర్ సభను అడ్డుకోవాలని రేవంత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు కొడంగల్ బంద్ కు కూడా రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్ సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తలుపులు పగలకొట్టి......
ఆయనతో పాటు ఆయన ప్రధాన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కొడంగల్ లో 144వ సెక్షన్ నవిధించారు. అయితే తన ఇంటి తలుపులు పగలకొట్టి మరీ అరెస్ట్ చేశారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రేవంత్ ను అరెస్ట్ చేశారని తెలియడంతో కొడంగల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story