
ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏపీలోని 13 జిల్లాల్లో 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో నేడు 2,789 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.
Leave a Reply