Sat Apr 20 2024 13:34:07 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కుటుంబానికి అక్కడ స్థలం కేటాయిస్తాం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కారణాలు చెప్పకుండానే అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అసమర్థుడని విమర్శించారు. రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ తెలంగాణ ఇచ్చాక కుటుంబంతో కలిసి సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఫోటోలు దిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సోనియా గాంధీని పొగడలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ తాగి మాట్లాడారని అనుమానం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, తాము గెలవగానే తెలంగాణను అన్ని రకాలుగా దోచుకున్న కేసీఆర్, కేసీఆర్ కుటుంబానికి జైలులో ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు.
Next Story