జగన్ పై శివసేన ప్రశంసలు

ఉద్ధవ్ థాక్రే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై శివసేన పార్టీ ప్రశంస జల్లు కురిపించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ ను ‘విజయ వీరుడి’గా ఆ పార్టీ కీర్తించింది. ఈ మేరకు శివసేన పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయంలో ప్రచురించింది. జగన్ గెలిచిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారని, నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించారని ఈ పత్రిక ప్రచురించింది. జగన్ కు రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అభిప్రాయపడింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*