విజయసాయివి చిల్లర ప్రయత్నాలు
16 నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టిన శ్రీ విజయసాయిరెడ్డి తరపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి [more]
16 నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టిన శ్రీ విజయసాయిరెడ్డి తరపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి [more]
16 నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టిన శ్రీ విజయసాయిరెడ్డి తరపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారన్నారు. ఆ లేఖని రాష్ట్రపతి కార్యాలయం దాదాపు నెలన్నర తరువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫార్వార్డ్ చేసిందని తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతిగారికి లేఖ రాసినా, అర్జీ పెట్టుకున్నా రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వ శాఖకు దాన్ని ఫార్వార్డ్ చేయడం రివాజు అని సుజనా చౌదరి తెలిపారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి తన మీద అభూతకల్పనలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ కూడా హోం మంత్రిత్వ శాఖకు చేరిందన్నారు. తన మీద ఏ విధమైన ఆరోపణలు గానీ, ఫిర్యాదులు గానీ, ఏ సంస్థ గానీ, ఏ వ్యక్తిగానీ ఇంతవరకు చేయలేదన్నరాు. తన మీద ఎక్కడా, ఏ విధమైన కేసులు లేవని సుజనా చౌదరి తెలిపారు. తన జీవితం, తన బిజినెస్ కెరియర్, తన పొలిటికల్ కెరియర్ తెరిచిన పుస్తకాలని సుజనా చౌదరి తెలిపారు.. రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎక్నాలెడ్జ్ మెంట్ ను పట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చడానికి విజయసాయిరెడ్డి చేస్తున్న మరొక చిల్లర ప్రయత్నమే ఇది అని సుజనా చౌదరి తెలిపారు. వారం వారం కోర్టు మెట్లెక్కుతూ, తుది తీర్పు కోసం, తీర్పుతో పడే శిక్ష కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్న కన్ఫార్మ్డ్ క్రిమినల్ విజయసాయిరెడ్డి అని సుజనా చౌదరి ఫైరయ్యారు.