
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. వ్యాక్సినేషన్ ను జరపాలని, నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గి కోరారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Leave a Reply