ఆత్మ హత్యలపై జోక్యం చేసుకోలేం
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కింది కోర్టు ఇచ్చిన తీర్పు లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం [more]
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కింది కోర్టు ఇచ్చిన తీర్పు లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం [more]
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కింది కోర్టు ఇచ్చిన తీర్పు లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లయింది. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ల పై సుప్రీం కోర్టు లో ఇవాళ విచారణకు వచ్చింది. క్రింది కోర్టు ఇచ్చిన తీర్పు పై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. బాలల హక్కుల సంఘం అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది . హైకోర్టు తీర్పుతో తాము విభేదించలేమని పేర్కొంది. న్యాయ వ్యవస్థ పై అపార నమ్మకం,గౌరవంతో పిటిషన్ వేశామని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు తెలిపారు. తీర్పును శిరసావహిస్తూ, నిజాయితీ, నిబద్ధత తో పిల్లల పక్షాన తన న్యాయ పోరాటం నిర్వహించింది. బాలల హక్కుల సంఘం ఇదే స్పూర్తి తో పిల్లల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తుందని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుత రావు తెలిపారు.