
కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలవనున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అయితే, గత కొన్నిరోజులుగా పార్టీ వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారని టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో ఇవాళ వారంతా అమరావతి వెళ్లి చంద్రబాబును కలుస్తున్నారు. అదే సమయంలో మేడా… జగన్ ను కలవడం ద్వారా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. మేడా.. ప్రస్తుతం శాసనసభ విప్ గా కూడా ఉన్నారు.
Leave a Reply