అవసరమైతే తెలంగాణ బంద్

ఆర్టీసీ సమ్మె

తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై ఇవాళ హైదరాబాదులో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతలను ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదన్నారు. ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌పై కూడా అశ్వత్థామరెడ్డి విమర్శలు గుప్పించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదని విమర్శించారు. ఆర్టీసీపై డిజిల్ భారం ఎక్కువైందని, డీజిల్ పై 27శాతం పన్ను వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని, వారంతా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అశ్వత్థామరెడ్డి చెప్పారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*