ఉండవల్లి సమావేశానికి వైసీపీ డుమ్మా…??

ఉండవల్లి అరుణ్ కుమార్

ఉండవల్లి అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొడుతోంది. తెలుగుదేశం పార్టీ హాజరు ఉంటే తాము ఈ సమావేశంలో భాగస్వామ్యం కాలేమని వైసీపీ తేల్చి చెప్పింది. ఎన్నికల వేళ టీడీపీతో వేదిక పంచుకునే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈరోజు విజయవాడ ఐలాపురంలో జరగనున్న ఉండవల్లి అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ హాజరుకానుంది. ఈ సమావేశానికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లు హాజరుకానున్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుపర్చకపోవడం, వచ్చే ఎన్నికల్లో ఎజెండా అంశాలపై ఉండవల్లి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఉండవల్లి తెలిపారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను స్వయంగా హాజరవుతానని వెల్లడించారు. ఏ ఏ పార్టీలు హాజరవుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Ravi Batchali
About Ravi Batchali 32588 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*