
వంగవీటి రాధా మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. రాధా తన పోటీపై నిర్ణయాన్ని చంద్రబాబుకు తెలియజేయనున్నారు. వంగవీటి రాధా ఇటీవలే టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పోటీచేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్లమెంటు సభ్యుడిగా బరిలోకి దించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంటు స్థానాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. రాధా పోటీకి ఓకే అంటే ఏ స్థానాన్ని అయినా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం కొన్ని నియోజకవర్గాలను తొలి జాబితాలో ప్రకటించలేదు. మరి రాధా పోటీకి సై అంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply