
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానసిక పరిస్థితి బాగాలేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కిందపడినా తానే గెలిచినట్లు చెప్పుకునే తత్వం చంద్రబాబుదన్నారు. రాష్ట్రంలో యాభై శాతం ఓట్లతో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ సానుభూతితో గెలిచాడని, లేకుంటే తనదే విజయమని చంద్రబాబు పార్టీ శ్రేణులకు నచ్చ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ చంద్రబాబునాయుడికి ఫోన్ చేసేటప్పుడు తాను పక్కనే ఉన్నానని, అయితే జగన్ అనని మాటలను కూడా అన్నట్లు తన అనుకూలమీడియాలో బాబు రాయించుకున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బాబు అనుకూలమీడియాలో చంద్రబాబును మీ అనుభవం, సలహాలు తనకు కావాలని జగన్ కోరినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆయన అనుభవమంతా రాష్ట్రాన్ని దోచుకోవడానికే వినియోగించారని, ఆయన సలహాలు తమకు అక్కరలేదన్నారు విజయసాయి రెడ్డి. ఇకనైనా చంద్రబాబు మారితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Leave a Reply