విజయసాయి బ్రెయిన్ వాష్ చేశారా…?

vijayasaireddy rk roja

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నగరి ఎమ్మెల్యే రోజాకు బ్రెయిన్ వాష్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం రోజా అసంతృప్తికి లోనయిన సంగతి తెలిసిందే. తనకు తొలిసారి విస్తరణలో చోటు దక్కకపోవడంతో రోజా కినుక వహించారు. దీంతో జగన్ రోజాను ఈరోజు అమరావతికి పిలిపించారు. తొలుత విజయసాయి రెడ్డితో రోజా గంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని విజయసాయిరెడ్డికి వివరించారు. తనకు ప్రాధాన్యత దక్కకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని రోజాకు విజయసాయిరెడ్డి వివరించారు. అనంతరం సీఎం జగన్ తో రోజా పదినిమిషాలు భేటీ అయ్యారు. తనకు ఎలాంటి పదవులు వద్దని జగన్ వద్ద రోజా స్పష్టం చేసినట్లు సమాచారం.

Ravi Batchali
About Ravi Batchali 16593 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*