Fri Apr 26 2024 06:14:45 GMT+0000 (Coordinated Universal Time)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కొత్త పేరు
పశ్చిమ బెంగాల్ పేరు త్వరలోనే మారనుంది. ఆ రాష్ట్రానికి ‘బంగ్లా’గా పేరుమారుస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ ఆమోదించడమే తరువాయి, పశ్చిమ బెంగాల్ పేరు ‘బంగ్లా’గా మారనుంది. వెస్ట్ బెంగాల్ పేరు మొదటి అక్షరం ‘డబ్లూ’తో మొదలవుతుంది. దీంతో అక్షరక్రమంలో ఆ రాష్ట్ర పేరు అన్ని రాష్ట్రాల తర్వాత చివరన వస్తుంది. దీంతో రాష్ట్ర పేరు మార్చాలని ఆ ఆ రాష్ట్రం పట్టుబడుతోంది. ఇంతకుముందు కూడా రాష్ట్ర పేరు మార్చాలని కేంద్రానికి పలుమార్లు వినవించినా కేంద్రం తిరస్కరించింది. మరి ఈసారైనా పశ్చిమ బెంగాల్ కొరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
Next Story