
రాజభవన్ లో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా ఇఫ్తార్ విందుకు హాజరుకానున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందుతర్వాత భేటీ అయ్యే అవకాశముంది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రధానంగా హైదరాబాద్ ఏపీ సచివాలయం, అసెంబ్లీ అప్పగింతతో పాటు పదో షెడ్యూల్ లో పేర్కొన్న ఆస్తుల విభజన అంశాలపై కూడా చర్చించనున్నారు.
Leave a Reply