
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలను జగన్ అభినందించారు. రోజుకు ఏపీలో ఇరవై ఐదు వేల టెస్ట్ లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ ఏపీలో పది లక్షల పైగానే టెస్ట్ లను నిర్వహించామని, ఇది దేశంలో లోనే రెండో స్థానమని జగన్ చెప్పారు. కరోనా సోకిన వారిలో 85 శాతం మంది ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారని జగన్ చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని జగన్ అభిప్రాయపడ్డారు. కేసులు పెరుగుతున్నాయని భయపడాల్సిన పనిలేదన్నారు.
Leave a Reply