మరో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్

జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్ లైన్ ఈ కార్యక్రమాన్ని జగన్ నిర్వహించారు. 490 కోట్ల వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముప్ఫయి గ్రామాలకు తాగునీరు, వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరనుంది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా విస్మరించిందని జగన ఈ సందర్భంగా అన్నారు. 2021 ఫిబ్రవరి కల్లా ఈ ప్రాజెక్టును పూర్త చేయాలన్నారు. సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి నీరు అందడం లేదనే వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 2.7 టీఎంసీ నీటిని అందించాలన్న లక్ష్యంతో 490 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును రూపొందించామన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 32308 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*