అభయం యాప్ ను ప్రారంభించిన జగన్

జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభయం యాప్ ను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా దీనిని విశాఖ జిల్లాలో ఎంపిక చేశారు. ప్రవేటు క్యాబ్ లు, ఆటోల్లో ప్రయాణించే వారికి ఈ అభయం యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇది అమలు జరుగుతుందని తెలపారు. ఆటోలు, క్యాబ్ లు ట్రాకింగ్ కోసం ఈ యాప్ ఉపయోగపడుతుందని జగన్ చెప్పారు. మహిళల భద్రత కోసమే ఈ యాప్ ను ప్రారంభించినట్లు జగన్ వివరించారు. ఆటోలో పానిక్ బటన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పానిక్ బటన్ నొక్కితే వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారని జగన్ వివరించారు. మొత్తం లక్ష వాహనాలకు ఈ యాప్ ను విస్తరింప చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ తెలిపారు.

Ravi Batchali
About Ravi Batchali 36875 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*