
చంద్రబాబునాయుడు అందరినీ నిట్టనిలువునా ముంచారన్నారు. రైతుల దగ్గర నుంచి డ్వాక్రామహిళల వరకూ రుణమాఫీ చేస్తానని మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్ఛాపురంలో జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు యువతకు ఉపాధి కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడబెరికారన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబునాయుడు పాలన చూసి సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ ఉండరన్నారు. కనీసం కళాశాలల్లో మరుగుదొడ్లు కూడా నిర్మించలేదన్నారు. చంద్రబాబునాయుడు ఈనాలున్నరేళ్ల కాలంలో ఆరు వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారన్నారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లను ఎత్తివేశారన్నారు.
విద్యార్థులకు కూడా….
పాఠశాలల్లో కనీసం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కూడా జరగలేదన్నారు. మార్చి ఏప్రిల్ నెలలో జరగాల్సిన పుస్తకాల పంపిణీ ఇంతవరకూ జరగలేదన్నారు. నాసిరకం యూనిఫాంలు ఇచ్చి చంద్రబాబు పిల్లల సొమ్మునూ దోచుకుంటున్నారన్నారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దిగజార్చారన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు కూడా ఆరు నెలల నుంచి ఇవ్వడం లేదన్నారు. తనకు బినామీ అయిన నారాయణ, చైతన్య స్కూళ్లకు ప్రయోజనం చేయడం కోసమే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తన పాదయాత్రలో కళాశాల విద్యార్థులు తనను కలసి గోడును వెళ్లబోసుకున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక విద్యార్థులు చదువు కూడా మానివేసే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తడానికి కారణం చంద్రబాబు కాదా? అని జగన్ ప్రశ్నించారు.
Leave a Reply