
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం 10.40 గంటలకు ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అయితే ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే… ప్రధానిని కలిసేందుకు వెళుతున్న జగన్ కొత్తగా ఎంపికైన ఇద్దరు యువ ఎంపీలను తీసుకెళుతున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లను తనతో పాటు మోదీ వద్దకు తీసుకెళుతున్నారు. మోదీని తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించనున్నారు. మోదీని కలిసిన అనంతరం జగన్ ఏపీ భవన్ లో బసచేసి సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Leave a Reply