
ఇచ్ఛాపురం పురవీధులన్నీ జనంతో నిండిపోయాయి. జగన్ కు జేజేలు పలికేందుకు పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు, నేతలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చారు. ఇచ్ఛాపురం సమీపంలో ఏర్పాటు చేసిన 88 అడుగుల పైలాన్ ను జగన్ ఆవిష్కరించారు. ఇచ్ఛాపురంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మరికాసేపట్లో ముగియనుంది. పైలాన్ ను 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లను ఏర్పాటు చేశారు. పైలన్ పై వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 నెలల పాటు జగన్ ప్రజాసంకల్ప యాత్ర 13 జిల్లాల్లో సాగింది. వాననక, ఎండనక జగన్ చేసిన పర్యటన విమర్శల ప్రశంసలను అందుకుంది. ఆఖరి అడుగుకు అశేష జనవాహిని రావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.
Leave a Reply