జగన్ నమ్మినబంటును నేను

y-s-jaganmohanreddy-governor-narsimhan

జగన్ కు నమ్మినబంటుగా చెప్పుకోవడానికి తాను ఏమాత్రం భయపడబోనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు ఇచ్ఛాపురంలో జరిగే విజయయాత్ర రేపు జగన్ పట్టాభిషేక యాత్ర కానుందని అన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా ఇచ్ఛాపురం ఆరోజు వచ్చానని, ఈరోజు జగన్ పాదయాత్రకు ఇచ్ఛాపురానికి ఎమ్మెల్యేగా వచ్చానని, ఇది వైఎస్ కుటుంబం పుణ్యమేనని ఆయన తెలిపారు.

సునామీ ఖాయం….

ఇచ్ఛాపురం పాదయాత్ర ముగింపు సభలో శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు వద్ద ఉన్న అస్త్రాలన్నీ ఖర్చయిపోయాయని, ఇప్పుడు ఓటమికి దగ్గరగా ఉన్నారని, వైసీపీ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు అక్రమ సంపాదనతో తిరిగి గెలవాలని చూస్తున్నారని, ఓటుకు ఐదు వేలు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్దంగా ఉన్నారని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే అన్ని రోజుల్లో డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదని, జగన్ సునామీలో చంద్రబాబు కొట్టుకుపోనున్నారని ఆయన తెలిపారు.

Ravi Batchali
About Ravi Batchali 32521 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*