ముందంజలో హిల్లరీ : వెలువడుతున్న ఫలితాలు
ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఓటింగ్ ప్రక్రియ ఉండే అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రస్తుతం కొనసాగుతోంది. అమెరికాలో మొత్తం 20 కోట్ల మంది ప్రజలు తమ కొత్త అధ్యక్షుడిని, అధ్యక్షురాలిని ఎన్నుకోవడానికి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆరు టైమ్ జోన్ ల ప్రకారం ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు కూడా జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. న్యూహాంప్‌షైర్ లో హిల్లరీ ముందంజలో ఉన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఆమె నాలుగు ఓట్లు సాధించినట్లుగా వార్తలు వచ్చాయి.
అమెరికాలోని భారతీయుల్లో మెజారిటీ హిల్లరీకి అనుకూలంగా ఓట్లు వేస్తున్ట్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఓటు హక్కు ఉండి హిల్లరీ క్లింటన్ కు అనుకూలంగా వేసిన భారతీయ వ్యక్తులు, తాము ఓటు వేసిన వైనం ను భారత్ లోని తమ సన్నిహితులకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ తెలియజేసుకుంటున్నారు. మొత్తానికి హిల్లరీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
హిల్లరీ గెలిచినట్లయితే గనుక.. అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించినట్లు అవుతుంది.