20 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న ఆర్య.. చాలా స్పెషల్ మూవీ అంటున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఎవర్‌గ్రీన్ చిత్రం, 'ఆర్య'. మే 7న విడుదలైన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది
అల్లు అర్జున్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో ఈ చిత్రం సమయంలో చోటు చేసుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. 'ఇది తనకు కేవలం సినిమా మాత్రమే కాదు' అని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు
ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఫీల్ మై లవ్.. ఫీల్ మై లవ్ అంటూ బన్నీ చేసిన సందడి అంతా ఇంతా కాదు
ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట సూపర్ హిట్. 'అ అంటే అమలాపురం' పాట ఐటెమ్ సాంగ్స్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది
సుకుమార్ రచన, దర్శకత్వం వహించిన 'ఆర్య' అల్లు అర్జున్ నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ. ఈ చిత్రంలో అను మెహతా, శివ బాలాజీ కీలక పాత్రలు పోషించారు
ఆర్య అనే యువకుడు గీత అనే అమ్మాయితో ప్రేమలో పడడం.. గీత అజయ్ ను ప్రేమించడం.. ఆ తర్వాత గీత ప్రేమను గెలిపించడానికి ఆర్య చేసే ప్రయత్నమే ఈ సినిమా అసలు కథ
'ఆర్య' సినిమా దర్శకుడిగా సుకుమార్‌కి తొలి చిత్రం. ఇది మే 7, 2004న థియేటర్లలో విడుదలైంది. 50 రోజులు.. 100 రోజులు అంటూ.. సినిమాకు విపరీతమైన ఆదరణ పొందింది. ఈ సినిమాకు మొదట ‘నచికేత’ అని టైటిల్‌ పెట్టాలనుకున్నా చివరకు ‘ఆర్య’ని ఫిక్స్‌ చేశారు
హీరోగా మొదట అల్లరి నరేష్ ను అనుకున్నారట సుకుమార్. కానీ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది. రొటీన్ కథ చెప్పడానికి వాచఃరని అనుకుని అల్లు అర్జున్ మొదట ఈ సినిమా చేయకూడదని అనుకున్నారు.. కథ విన్నాక ఎంతో నమ్మకంతో పని చేశాడు అల్లు అర్జున్
2003 నవంబరు 19న ‘ఆర్య’ షూటింగ్ మొదలవ్వగా.. 120 రోజుల్లో పూర్తి చేశారు. ఈ మూవీని రూ.4 కోట్లతో నిర్మిస్తే, ఫుల్‌ రన్‌లో రూ.30 కోట్లు వసూలు చేసింది