ఫ్యామిలీ స్టార్ సినిమాలో ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు.. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5న విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించి వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఖుషీ మాత్రమే కొంచెం మంచి నంబర్లను బాక్సాఫీసు దగ్గర సాధించింది.
ఫ్యామిలీ స్టార్‌కి మాత్రం ఓపెనింగ్‌లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఉండగా.. దిల్‌రాజు నిర్మాతగా గీత గోవిందం బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వచ్చినప్పటికీ, ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులలో కనీస బజ్‌ను సృష్టించలేకపోయింది
ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ ఖుషీ, లైగర్, డియర్ కామ్రేడ్ దగ్గరలో కూడా లేవు. షాకింగ్ విషయం ఏమిటంటే.. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ మొదటి రోజు కలెక్షన్స్ కంటే కూడా తక్కువ నెంబర్ ఈ సినిమాకు వచ్చింది.
నైజాం: 1.8 కోట్లు, ఆంధ్రా: 1.6 కోట్లు, సీడెడ్: 0.45 కోట్లు.. మాత్రమే వచ్చాయి. టోటల్ తెలుగు స్టేట్స్ షేర్ 3.85 కోట్లు. ఇండియా+ ఓవర్సీస్‌లో దాదాపు 2.5 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ దాదాపు 6.35 కోట్లు మాత్రమే
ఫ్యామిలీ స్టార్ సినిమా ప్లస్ పాయింట్స్ మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, ఫస్ట్ హాఫ్
నెగటివ్ పాయింట్స్ సాంగ్స్, రొటీన్ సెకండాఫ్, ఎమోషన్స్ కనెక్ట్ కాలేకపోవడం
ఫ్యామిలీ స్టార్ టీమ్ ఈ చిత్రానికి మంచి మద్దతు లభిస్తోందని తెలిపింది. ప్రెస్ మీట్ నిర్వహించి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చెప్పారు
ఈ సినిమా బ్రేక్ఈవెన్ 45 కోట్ల వద్ద ఉంది. లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి