పూజ హెగ్డే.. రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో చిందేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ భారీ హిట్ అయింది. ఇప్పుడు మరో స్పెషల్ పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ చేయనుంది
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా దేవర. ఈ సినిమాలో ప్రత్యేక పాటకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది
ఈ సినిమా మేకర్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ లు ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేని సంప్రదించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'లో జూనియర్ ఎన్టీఆర్‌తో స్క్రీన్‌స్పేస్‌ను పంచుకుంది పూజ హెగ్డే
ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు దేవరలో కూడా ఇద్దరూ ఆడిపాడే అవకాశం ఉంది. ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన పెండింగ్‌లో ఉంది
మరో వైపు పూజాహెగ్డే ప్రేమాయణం గురించి కూడా ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్‌బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో బుట్ట బమ్మ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతూ ఉంది
గత కొంతకాలంగా పూజా హెగ్డే హాజరవుతున్న ప్రతి ప్రైవేట్ ఫంక్షన్స్‌లో రోహన్ మోహ్ర కనిపిస్తూ ఉన్నాడు. ఇటీవల పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ కూడా రోహన్ మెహ్ర ఉన్నాడు
34 ఏళ్ల మెహ్రా బజార్ (2016) సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. గతంలో, అతను నటి తారా సుతారియాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి
పూజా ఒక క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నాదని, పెళ్లి కూడా చేసుకోబోతోందని ఇంతకు ముందు పుకార్లు కూడా వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని తేలింది. వర్క్ పరంగా ఆమె తదుపరి సినిమాలో షాహిద్ కపూర్ సరసన దేవా చిత్రంలో కనిపించనుంది.