క్యూట్ గా ఉన్నా.. కేతికకు హిట్ కావాలి!!

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ నటి కేతిక శర్మ తన ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటూ ఉంది
ఈ 28 ఏళ్ల అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చాలా ఏళ్లు అవుతోంది
పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ సినిమా 'రొమాంటిక్' తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా జనం లోకి వెళ్ళలేదు
ఇక ఆ తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య సినిమాలో చేసింది. అది కూడా ఫ్లాప్ గానే నిలిచింది
మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో చేసినప్పటికీ అది డిజాస్టర్ గా నిలిచింది
ఇక పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కాంబోలో వచ్చిన 'బ్రో' సినిమాలో నటించి కేతిక కొంచెం పాపులారిటీని దక్కించుకుంది
సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా కేతిక సోషల్ మీడియాలో మాత్రం ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ ఉంటుంది
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో కేతికకు ఏకంగా 3.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో అమ్మడు రెచ్చిపోయింది. పూల్ దగ్గర ఫోజులిస్తూ కుర్రకారును గిలిగింతలు పెట్టే ఫోటోలను అప్లోడ్ చేసింది