సంపూర్ణ సూర్య గ్రహణం.. ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే?

ఏప్రిల్ 8న అంటే మరో రెండ్రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది
మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాలో గ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది
కొన్ని కరీబియన్ దేశాలు, స్పెయిన్, వెనెజువెలా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్ ల్యాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం దర్శనమివ్వనుంది
మెక్సికోలో ముందుగా గ్రహణం 11:07 గంటలకు (పీడీటీ కాలమానం)కి కనిపిస్తుంది. ఆ తర్వాత సుమారు 01:30 గంటలకు (పీడీటీ) ముగుస్తుంది
భారత కాలమానం ప్రకారం భారత్ లో 8వ తేదీ రాత్రి 9:12 గంటలకు మొదలై అర్ధరాత్రి దాటాక 02:22 గంటలకు ముగుస్తుంది
భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి సూర్యగ్రహణం కనిపించదు.
నాసాతో పాటు టెక్సాస్ లోని మెక్ డొనాల్డ్ అబ్సర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది
ప్రతి సంవత్సరం, కనీసం రెండు నుండి ఐదు సూర్య గ్రహణాలు ఉంటాయి.. అయితే సంపూర్ణ గ్రహణాలు ప్రతి 18 నెలలకు ఒకసారి మాత్రమే సంభవిస్తాయి
భూమిపై ఒక నిర్దిష్ట ప్రదేశం 400 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తుంది. భూమి సగం భూమి నివాసయోగ్యం కాదు కాబట్టి, చాలా మంది వ్యక్తులు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడటం చాలా అరుదు